శ్రీకాళహస్తీశ్వరుని ధ్వజారోహణం... సర్వదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

గురువారం, 3 మార్చి 2016 (20:49 IST)
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరుని ధ్వజారోహణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో ధ్వజ స్తంభానికి సారెలను కట్టి సర్వదేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు వేదపండితులు. 
 
ఎక్కడాలేని విధంగా శ్రీకాళహస్తి ఆలయంలో రెండు ధ్వజారోహణలు జరుగడం ఇక్కడ విశేషం. ముక్కంటీశునికి అత్యంత ఇష్టమైన భక్తకన్నప్ప ఆలయంలో నిన్న ధ్వజారోహణ ఘట్టం పూర్తయ్యింది. 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. రోజుకో వాహనంపై స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

వెబ్దునియా పై చదవండి