ఆదివారం తేదీ 20-04-05 దిన ఫలాలు - పనులు ఒక పట్టాన సాగవు...

రామన్

ఆదివారం, 20 ఏప్రియల్ 2025 (04:00 IST)
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. సంకల్పబలంతోనే లక్ష్యం సాధిస్తారు. అవకాశాలు చేజారినా కుంగిపోవద్దు. ధైర్యంగా యత్నాలు సాగించండి. లావాదేవీలతో తీరిక ఉండదు. ఖర్చులు విపరీతం. ముఖ్యుల కలయక వీలుపడదు. పనులు ఒక పట్టాన సాగవు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రణాళికాబద్ధంగా యత్నాలు సాగిస్తారు. మీ కృషి వెంటనే ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఆరోగ్యం జాగ్రత్త. బంధువులతో సంభాషిస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. కీలక సమావేశంలో పాల్గొంటారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కార్యక్రమాలు విజయవంతమవుతాయి. పొదుపు ధనం అందుతుంది. ఆప్తులకు సాయం చేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. పనులు సావకాశంగా పూర్తిచేస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
సమర్ధతను చాటుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. రుణసమస్యలు కొలిక్కివస్తాయి. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. నగదు, వాహనం 
జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. ప్రయాణం సజావుగా సాగుతుంది.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఆలోచనలు నిలకడగా ఉండవు. అన్యమస్కంగా గడుపుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదా చెల్లింపుల్లో జాగ్రత్త. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. పనులు మందకొడిగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. దంపతుల మధ్య అకారణ కలహం. వేడుకకు హాజరు కాలేరు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కార్యం సిద్ధిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. అన్ని విధాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చుకోండి. ఖర్చులు సామాన్యం. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యం కాదు. పనులు మొండిగా పూర్తి చేస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వేడుకను ఘనంగా చేస్తారు. ప్రముఖుల రాక సంతోషం కలిగిస్తుంది. పరస్పరం కానుకలిచ్చిపుచ్చుకుంటారు. ఖర్చులు విపరీతం. వాయిదా చెల్లింపుల్లో జాప్యం తగదు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఖర్చులు అధికం. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. అనవసర జోక్యం తగదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ధృఢసంకల్పంతో అడుగు ముందుకేస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపుల్లో జాప్యం తగదు. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. ఏకాగ్రత తగ్గకుండా చూసుకోండి. ఒంటెద్దు పోకడ తగదు. అయిన వారి కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ కష్టం ఫలిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఆత్మీయులతో సంభాషిస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. ముఖ్యులతో పరిచయాలు బలపడతాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు