ఒరిస్సా సాంస్కృతిక కేంద్రం కటక్

Pavan Kumar

శనివారం, 14 జూన్ 2008 (19:50 IST)
ఒరిస్సా సాంస్కృతిక కళలకు కేంద్రం కటక్. కటక్ అనే పదం కటక నుంచి వచ్చింది. కటక అంటే సైనికుల శిబిరం. కటక్‌కు దాదాపు వేయి సంవత్సరాల చరిత్ర ఉంది. కేసరి వంశ రాజులు ఒరిస్సాను 9వ దశాబ్దంలో పరిపాలించారు. వారి సమయంలో కటక్‌లో సైనిక శిబిరం ఉండేది. కేసరి వంశ రాజైన మర్కట కేసరి పరిపాలనా కాలమైన 1002 సంవత్సరంలో కటక్ నగరం నిర్మాణం ప్రారంభమైంది.

గంగ వంశ రాజైన అనంగ భీమదేవ పరిపాలనా కాలమైన 1211 సంవత్సరంలో కటక్ రాజధానిగా చేసుకుని పరిపాలించారు. 14వ శతాబ్దంలో గజపతులు చేతికి వచ్చింది. ఆ తర్వాత సూర్య వంశం, మరాఠాల అనంతరం మొఘలుల ఆధీనంలోకి వచ్చింది. బ్రిటీషు వారి కాలంలో ఒరిస్సా డివిజన్ రాజధానిగా కటక్ చేశారు. ఇది 1816వ సంవత్సరంలో జరిగింది.

చూడవలసిన ప్రాంతాలు
బారాబతి కోట
కటక్‌ను రాజధానిగా చేసుకుని పరిపాలించిన రాజులు నిర్మించిన కోట బారాబతి. బారబతి కోట శిథిలాలు ఇప్పటికీ చూడవచ్చు.

గురుద్వారా దాతన్ సాహెబ్
సిక్కు మత స్థాపకుడు గురునానక్ ఒరిస్సా పర్యటనలో భాగంగా పూరికి విచ్చేసేముందు కటక్‌లో కాసేపు ఆగారు. అక్కడ ఆయన చెట్టును నాటారు. ఇక్కడ నిర్మించిన సిక్కుల ప్రార్ధనా మందిరమే గురుద్వారా దాతన్ సాహెబ్.

వసతి
అన్ని తరగతుల వారికి అవసరమైన వసతి సదుపాయాలు ఉన్నాయి.

ఎలా చేరుకోవాలి
విమాన మార్గం : భువనేశ్వర్ (29 కి.మీ.) సమీపంలోని విమానాశ్రయం.
రైలు మార్గం : హౌరా-విశాఖ పట్నం మార్గంలో కటక్ రైల్వే స్టేషన్ ఉంది. కటక్ నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైలు సౌకర్యం ఉంది.
రహదారి మార్గం : కోల్‌కతాతో పాటుగా రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల నుంచి బస్సు సేవలు ఉన్నాయి.

వెబ్దునియా పై చదవండి