మైండ్ రిలాక్స్‌కు కేరాఫ్ జైపూర్ పింక్ సిటీ

సోమవారం, 7 జులై 2008 (20:35 IST)
ఎడారుల పేరు చెబితేనే మనకు రాజస్థాన్ గుర్తుకు వస్తుంది. ఈ ఎడారుల రాష్ట్రంలో పచ్చదనం కావాలంటే జైపూర్‌లోని పింక్ సిటీకి వెళ్లాల్సిందే. పింక్ సిటీ ఎక్కడ... దాని ప్రత్యేకత ఏమిటీ... అనుకుంటున్నారా...? మీరు జైపూర్ ను పర్యటించాలనుకుంటే తప్పకుండా దర్శించాల్సిన ప్రాంతం ఈ పింక్ సిటీ. ఇక్కడ పచ్చపచ్చని చెట్లు, పక్షుల కిలకిల రావాలు మీ మనసులను మైమరిపింప చేస్తాయి.

కాంక్రీట్ జంగిల్‌కు కాస్త దూరంగా ప్రశాంత వాతావరణంలో గడపాలనుకునేవారు ఇప్పుడు పింక్ సిటీవైపు అడుగులు వేస్తున్నారు. పింక్ సిటీ ప్రత్యేకత ఏమిటీ అనుకుంటున్నారా...? ఇక్కడే సునిల్ మెహతా అనే వ్యాపారవేత్త నిర్మించిన కాటేజ్‌లు మనకు దర్శనమిస్తాయి.

చెట్ల మొదళ్లే పిల్లర్లుగా మారితే... కొమ్మలు పైకప్పులుగా చేసుకుని నిర్మించిన ఈ ప్రకృతి గృహాలు ఇట్టే ఆకర్షిస్తాయి. దాదాపు కోటి రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ ఫామ్ హౌస్ ఈ ఏడాది చివరికల్లా పూర్తవుతుందని మెహతా చెపుతున్నారు. అంతకంటే ముందు ఓ రెండు నిమిషాలు మీ మనసును మరో లోకానికి తీసుకెళ్లే ఈ వీడియోను చూడండి.

వెబ్దునియా పై చదవండి