అందాలను ఆరబోసిన ప్రకృతి డార్జిలింగ్‌

సోమవారం, 26 సెప్టెంబరు 2011 (19:09 IST)
File
FILE
ప్రకృతి.. తన అందాలను ఆరబోసిన ప్రదేశం డార్జిలింగ్‌. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఉత్తర భాగాన 7004 అడుగుల ఎత్తున తూర్పు హిమాలయాల్లో నేపాల్‌, భూటాన్‌ దేశాలకు చేరువలో డార్జిలింగ్‌ కేంద్రీకృతమైవుంది. ఈ ప్రాంతానికి సిలిగురి నుంచి ఇక్కడకు చేరుకోవచ్చన్నారు. ఇది కాంచనగంగ పర్వత శ్రేణులలో ఉంది.

డార్జిలింగ్‌ అంటే పిడుగుల ప్రదేశమని అర్థం. ఈ ప్రాంతంలో అనేక చోట్ల చిన్న చిన్న జలపాతాలున్నాయి. ఇక్కడ రైలు ప్రయాణం ఎంతగానో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ట్రెక్కింగ్‌ లాంటి సాహసక్రీడలకు అనువైన ప్రాంతంగా డార్జిలింగ్ ఉంది. కొండ శిఖరాల అందాలు, ఎన్నో రమణీయ ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. పొగమంచు దుప్పటి, ప్రకాశవంతమైన సూర్యాస్తమయం ఇట్టే ఆకట్టుకుంటున్నాయి.

డార్జిలింగ్‌లో ఉన్న ఎన్నో దర్శనీయ స్థలాల్లో చంచల్‌ లేక్‌ ఒకటి. ఈ నది నుంచి డార్జిలింగ్‌ ప్రాంత ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తారు. ఇది 8031 అడుగుల ఎత్తున ఉంది. డార్జిలింగ్‌‌లోని కాళీమాత ఆలయం హిందువులకు, బౌద్ధులకు పవిత్ర పుణ్యక్షేత్రంగా ఉంది. బౌద్ధుల గ్రంథాలయం ఉంది. హిమాలయన్‌ మౌంటనీరింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఇక్కడే వెలసి వుంది.

డార్జిలింగ్ అందాలను రోప్‌ వే ప్రయాణంలో ఆకాశమార్గంలో ఇక్కడి అందాలను తిలకించవచ్చు. టీ తోటలను కూడా చూడవచ్చు. బుద్ధుడి 14 అడుగుల కాంస్య విగ్రహం ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న లాయిడ్‌ బొటానికల్‌ గార్డెన్‌లో హిమాలయ పర్వత వృక్షజాతులను చూడవచ్చు.

బెంగాల్‌ నేచురల్‌ హిస్టరీ మ్యూజియంలో రకరకాల వన్యప్రాణులను చూడవచ్చు. పద్మజానాయుడు జూలాజికల్‌ పార్క్‌లో సైబీరియన్‌ టైగర్‌ స్నో లిపర్డ్‌ బ్రీడింగ్‌ సెంటర్‌ ఉంది. హస్తకళలకు ఈ ప్రాంతం ఎంతగానో ప్రసిద్ధి చెందింది.

వెబ్దునియా పై చదవండి