పచ్చి టమోటాలు. వీటిని తినడం వల్ల వాటి పోషకాలు అధికంగా ఉండటం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇవి విటమిన్లు ఎ, సి, కె, అలాగే పొటాషియం, లైకోపీన్ వంటి యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలం. పచ్చి టమోటాలను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
టమోటాలలోని పొటాషియం, ఫైబర్లు రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
టమోటాలలో లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ప్రోస్టేట్, ఊపిరితిత్తులు, కడుపు క్యాన్సర్‌లతో సహా కొన్ని క్యాన్సర్‌ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
టమోటాలలోని విటమిన్ సి, లైకోపీన్ చర్మాన్ని ఎండ దెబ్బతినకుండా రక్షించడంలో, ఆరోగ్యకరమైన రంగుకు దోహదం చేస్తాయి.
విటమిన్ సి రోగనిరోధక పనితీరులో కీలక పాత్ర పోషిస్తుంది, ఇది టమోటాలలో వుంటుంది.
టమోటాలు ఫైబర్ యొక్క మంచి మూలం కనుక ఇది జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా మలబద్ధకాన్ని నివారిస్తుంది.