ఆగస్టు 15 లోపు లోక్‌పాల్ బిల్లు ఆమోదించాలి: హజారే

ఆగస్టు 15వ తేదీ లోపు లోక్‌‍పాల్ బిల్లును ఆమోదించాలని లేని పక్షంలో దేశ వ్యాప్తంగా ఉత్పన్నమయ్యే ఆందోళనలను ఎదుర్కొనేందుకు కేంద్రం సిద్ధం కావాలని సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే పిలుపునిచ్చారు. ఇది బ్లాక్‌మెయిల్ రాజకీయం కాదని ప్రజాక్షేమం కోసం ఈ తరహా హెచ్చరిక చేస్తున్నట్టు తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టకుండా తాస్కారం చేస్తే మాత్రం తాను మళ్లీ ఆందోళనకు దిగుతానని ప్రకటించారు.

కేంద్ర మంత్రి శరద్‌పవార్ ఒక్కరే కాదు అవినీతి ఆరోపణలు ఉన్న మంత్రులందరూ తప్పుకోవాలని తాను డిమాండ్ చేస్తున్నట్లు అన్నా హజారే ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. శరద్‌పవార్‌కు తనకు వ్యక్తిగత గొడవలు లేవని, ప్రవృత్తిలో భాగంగానే పోరాటం అని చెప్పారు.

ఇదే వేదికపై నుంచి మాట్లాడిన ఐపీఎస్ మాజీ అధికారిణి కిరణ్ బేడీ మాట్లాడుతూ లోక్‌పాల్ బిల్లు తొమ్మిదోసారైనా ఆమోదం పొందకుంటే ఆగస్టు 15 నుంచి మళ్లీ ఆందోళన మొదలు పెడతామని స్పష్టం చేశారు. 73 సంవత్సరాల గాంధేయవాది హజారే మళ్లీ ఆమరణ నిరాహారదీక్షకు దిగుతారని ఆమె ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి