ఉగ్రవాదులపై ప్రభుత్వం మెతకవైఖరి: అద్వానీ

FILE
నిరుడు ముంబైలో జరిగిన మారణహోమంలో ప్రధాన పాత్రధారి హఫీజ్‌ సయీద్‌ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదని బీజేపీ లోక్‌సభలో ఆరోపించింది.

ముంబై మారణకాండకు సంబంధించి కేంద్రప్రభుత్వం తాత్సారం చేస్తోందని, ఇదివరకు ఇరు దేశాల సంయుక్త ప్రకటన చేసాయని ఇందులో తీవ్రవాదానికి చర్చలతో సంబంధంలేదని చెప్పడమే కేంద్ర ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదమన భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్.కే. అద్వానీ లోక్‌సభలో మంగళవారం విమర్శించారు.

పాకిస్థాన్‌ ప్రభుత్వం హఫీజ్‌ సయీద్‌ను విడుదల చేసినా మన ప్రభుత్వం చూస్తూ ఊరుకుందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై బీజేపీతోపాటు ఇతర విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీసాయి.

వెబ్దునియా పై చదవండి