"ఉమెన్స్ డే" రోజున మహిళా బిల్లు: వీరప్ప మొయిలీ

FILE
"ఉమెన్స్ డే" సందర్భంగా మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఓ కానుకను అందించనుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లును మహిళా దినోత్సవం రోజున రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ తెలిపారు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లు వచ్చే వారం (మార్చి 8) ఉమెన్స్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేందుకు ఆస్కారం ఉందని మొయిలీ అన్నారు.

ఇదిలా ఉంటే.. ధరల పెరుగుదలకు నిరసన ఒకే తాటిపై నడిచే ప్రతిపక్షాలు.. మహిళా బిల్లు ఆమోదంపై సానుకూలంగా స్పందించాలని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. దీర్ఘకాలంగా పెండింగ్‌ లో ఉన్న మహిళా బిల్లుకు రానున్న వంద రోజుల్లో ప్రభుత్వం మోక్షం కల్పిస్తుందని ఆమె హామీ ఇచ్చారు.

రాష్ట్ర చట్టసభలు, పార్లమెంటు ఉభయ సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఆమోదించడంతో పాటు పంచాయతీలు, స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లును సైతం తీసుకురానున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రతిభా పాటిల్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి