ఎఫ్‌బీఐ నుంచి చిట్కాలు పొందిన చిదంబరం

అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్‌ను తీవ్రవాద ముప్పు నుంచి ఎలా సంరక్షిస్తున్నారో కేంద్ర హోంశాఖ మంత్రి హోం శాఖ మంత్రి పి.చిదంబరం స్వయంగా పరిశీలించారు. అమెరికా పర్యటనలో భాగంగా చిదంబరం మంగళవారం న్యూయార్క్‌లోని ఎఫ్‌బీఐ అధికారులను కలుసుకున్నారు.

వారు ఈ సందర్భంగా న్యూయార్క్ నగరంలో భద్రతా ఏర్పాట్లను చిదంబరంకు వివరించారు. ఎఫ్‌బీఐ, నిఘా, భద్రతా సంస్థలు, న్యూయార్క్ పోలీసు విభాగాల అధికారులతో చిదంబరం చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా గత ఏడాది నవంబరులో ముంబయిలో జరిగిన ఉగ్రవాద దాడులను తరహాలో మళ్లీ దాడులు జరగకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యలను అమెరికా అధికారిక యంత్రాంగం చిదంబరంకు వివరించింది.

అంతేకాకుండా ఎప్పుడూ తీవ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉండే న్యూయార్క్‌ను కాపాడేందుకు అమెరికా భద్రతా సంస్థలు తీసుకుంటున్న చర్యలను కూడా చిదంబరం అడిగి తెలుసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి