ఐదేళ్ళలో కూలిపోనున్న ప్రేమ మందిరం: చరిత్రకారుల జోస్యం

గురువారం, 6 అక్టోబరు 2011 (11:27 IST)
ప్రేమకు చిహ్నంగా షాజహాన్ నిర్మించిన అద్భుత కట్టడం ప్రమాదం అంచుకు చేరిందా. అవుననే అంటున్నారు చరిత్రకారులు. ఈ కట్టడం పునాదికి ఏర్పడిన బీటలను పునరుద్ధరించకుంటే ఐదేళ్లలో కూలిపోవొచ్చునని వారు హెచ్చరిస్తున్నారు. పరిశ్రమల నుంచి వెలువడే రసాయన వ్యర్థాలు, అడవుల నరికివేత వల్ల ఏర్పడుతున్న కాలుష్యం కారణంగా యమునా నది ఎండిపోవడంతో ఈ చారిత్రక కట్టడం పునాది బీటలు వారి శిథిలావస్థకు చేరిందని చరిత్రకారులు భావిస్తున్నారు.

తాజ్‌మహల్‌లోని కొన్ని భాగాలలో, దాని చుట్టూ గల నాలుగు మినార్‌లలో గత సంవత్సరమే పగుళ్లు ఏర్పడిన విషయాన్ని గుర్తించినట్టు తెలిపారు. ప్రపంచంలోనే అపురూప కట్టడమైన తాజ్‌మహల్ మినార్‌లు, పునాది యమునా నదిలో నీళ్ళు లేకపోడంతో కూలిపోయే స్థితికి చేరుకున్నట్టు వారు తెలిపారు. అప్పటి నుంచి పునాది వద్దకు ఎవరినీ అనుమతించడం లేదని వారు గుర్తు చేశారు.

వెబ్దునియా పై చదవండి