కర్ణాటకకు వరద సహాయనిధిగా మరో వెయ్యికోట్లు: ప్రధాని

FILE
కర్ణాటక రాష్ట్రానికి వరద తక్షణ సహాయనిధిగా వెయ్యికోట్ల రూపాయలు అందిస్తామని దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి కర్ణాటకలోని వరద బాధిత ప్రాంతాలను శనివారం ఏరియల్ సర్వే ప్రధాని వీక్షించారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయ కార్యక్రమాలను కూడా సమీక్షించిన ప్రధాని అనంతరం మీడియాతో మాట్లాడారు.

మహారాష్ట్రలో బీభత్సం సృష్టించిన వరదలతో ప్రాణాలను కోల్పోయిన 226 మంది కుటుంబాలకు లక్ష రూపాయల ఎక్స్‌గ్రేషియాను అందజేస్తామని ప్రధాని ప్రకటించారు. వరద నష్టాన్ని అంచనా వేయడానికి త్వరలోనే కేంద్ర బృందాన్ని పంపుతామని మన్మోహన్ సింగ్ తెలిపారు.

ప్రధానితో జరిగిన సమీక్షా సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప, కేంద్రమంత్రులు ఎస్ఎం. కృష్ణ, వీరప్ప మొయిలీ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి