గుజరాత్‌లోకి ప్రవేశించిన 13 మంది ఉగ్రవాదులు : ఐబీ

శనివారం, 10 ఆగస్టు 2013 (16:13 IST)
File
FILE
గుజరాత్ రాష్ట్రంలోని 13 మంది ఉగ్రవాదులు సముద్ర మార్గం మీదుగా ప్రవేశించినట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) వెల్లడించింది. అందువల్ల రాష్ట్ర పోలీసులు, ఇతర నిఘా వర్గాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది.

ఇదిలావుండగా ఢిల్లీలో విధ్వంసం సృష్టించేందుకు లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ కుట్ర పన్నిన విషయం తెల్సిందే. దీంతో ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఢిల్లీలో తీవ్రవాద దాడులు నిర్వహిస్తామని లష్కరే తోయిబా వ్యవస్థాపక అధినేత హఫీజ్ సయీద్ గత నెల పాకిస్థాన్‌లో బహిరంగంగా ప్రకటించిన విషయం తెల్సిందే.

దీంతో భద్రతా సంస్థలు అప్రమత్తమై ఈ హెచ్చరికలను జారీ చేశాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందే ఢిల్లీలో తీవ్రవాద దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) హెచ్చరించడంతో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి