జమ్మూకాశ్మీర్‌కు చేరుకున్న ప్రధానమంత్రి

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ పర్యటన సమయంలో 450 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బాగ్లీహర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టును ఆయన ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టును రాంబాన్ జిల్లాలో నెలకొల్పారు. చెనాబ్ నదిపై నెలకొల్పిన ఈ ప్రాజెక్టు సరిహద్దు రాష్ట్రమైన జమ్మూకాశ్మీర్‌లలో మూడోది.

ఈ ప్రాజెక్టును మొత్తం 5200 కోట్ల రూపాయల వ్యయంతో నెలకొల్పగా, ప్రతి ఏడాది 2800 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆ తర్వాత శ్రీనగర్‌కు వెళ్లే మన్మోహన్ సింగ్.. అక్కడ వివిధ పార్టీల నేతలతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. వీరిలో నేషనల్ కాన్ఫెరెన్స్, కాంగ్రెస్, పిడిపి, సీపీఎం, పాంథర్స్ పార్టీ నేతలు పాల్గొంటారు.

తన రెండో రోజు పర్యటనలో ప్రధాని మన్మోహన్ సింగ్ లోయలో తొలి రైలు సర్వీసుకు జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు నౌగామ్ నుంచి బుద్గామ్‌ల మధ్య నడుపుతారు. అనంతరం ఆ రైలులో నౌగామ్‌ వరకు ప్రయాణిస్తారు. బారాముల్లా నుంచి ఖాజీగుండ్‌లను కలిపే చర్యల్లో భాగంగా ఈ రైలు సర్వీసులను ప్రారంభించారు.

వెబ్దునియా పై చదవండి