తరుణ్ తేజ్‌పాల్ : అమ్మాయి సమ్మతంతోనే చేశా!

శుక్రవారం, 6 డిశెంబరు 2013 (11:34 IST)
File
FILE
తమ సంస్థకు చెందిన మహిళా ఉద్యోగిని పట్ల తాను బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడలేదని, ఆ అమ్మాయి అనుమతితోనే తాను అలా ప్రవర్తించినట్టు తెహెల్కా వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ పోలీసులకు చెప్పారు. అమ్మాయి సమ్మతంతోనే తాను అలా నడుచుకున్నట్టు చెప్పారు. అయితే, బాధిత పాత్రికేయురాలు మాత్రం తేజ్‌పాల్ లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తున్న విషయం తెల్సిందే.

తేజ్‌పాల్ కస్టడీ గడువు శుక్రవారంతో ముగియనుండడంతో పొడిగింపు కోరాలని పోలీసులు భావిస్తున్నారు. విచారణలో ఆయన వెల్లడించిన వివరాల మేరకు మేనేజింగ్ ఎడిటర్ షోమాతోపాటు మరో ముగ్గురికి సమన్లు జారీ చేశామన్నారు. మరోవైపు ఈ కేసుపై మహిళా జడ్జితో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి