దేశం చిన్నారుల వ్యభిచార కేంద్రంగా మారుతోంది: సుప్రీం

శనివారం, 30 జనవరి 2010 (11:01 IST)
FILE
భారతదేశం రాను రాను చిన్నారుల వ్యభిచార కేంద్రంగా మారుతోందని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తంచేసింది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.

దేశంలో నానాటికీ చిన్నారులు బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టేయబడుతున్నారని, దీంతో దేశం చిన్నారుల వ్యభిచార కేంద్రంగా మారిపోతోందని సుప్రీం కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.

ఈ సమస్యను ఎదుర్కొనేందుకుగాను కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని జస్టిస్‌ దల్వీర్‌ భండారీ, జస్టిస్‌ ఎ.కె.పట్నాయక్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు అదనపు సొలిసిటర్‌ జనరల్‌ గోపాల సుబ్రమణ్యంను ఆదేశించింది.

చిన్నారులతో వ్యభిచారం చేయించేవారికి దేశంలోని అన్ని కోర్టులు ఇకపై బెయిలు మంజూరు చేయబోవని స్పష్టం చేసింది. ఇకపై ఇలాంటి పనులకు పాల్పడే ఎంతటి పెద్దవారైనా వారికి కఠిన శిక్ష విధించేందుకు ప్రభుత్వం చట్టాలను రూపొందించాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని కోరింది.

వెబ్దునియా పై చదవండి