నేడు పృథ్వీ-2 క్షిపణి రాకెట్ ప్రయోగం: డీఆర్‌డీఓ

పృథ్వీ - 2 క్షిపణి రాకెట్‌ను భారత సైన్యం గురువారం ప్రయోగించనుంది. ఇందుకోసం అవసరమైన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది. ప్రతిష్టాత్మకమైన పృథ్వీ - 2 క్షిపణిని ఐటిఆర్‌ పరిధికి (ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌) ఒరిస్సా రాష్ట్రంలోని చాందీపూర్‌ నుంచి ప్రయోగిస్తున్నారు.

ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలను చేధించే పృథ్వీ -2ను భారత్‌ 2010, డిసెంబర్‌ 22న జయవంతంగా ప్రయోగించింది. సైంటిస్ట్‌ రిసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డిఆర్‌డిఒ) పర్యవేక్షణలో టెస్ట్‌ ఫైరింగ్‌ ఉంటుందని అధికారులు తెలిపారు.

రెండు ఇంజన్ల సామర్థ్యంతో పనిచేసే పృథ్వీ - 2 తొమ్మిది మీటర్ల పొడవు, ఒక మీటరు వెడల్పు కలిగి ఉంది. శత్రు క్షిపణులను కనిపెట్టి మట్టుపెట్టడంలో చాకచాక్యంగా పనిచేస్తుందని ఆర్మీ ఉన్నతాధికారులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి