ప్రియుడుతో భార్య లేచిపోయిందని భర్త ఆత్మహత్య

గురువారం, 10 అక్టోబరు 2013 (18:32 IST)
FILE
అగ్నిసాక్షిగా తాళి కట్టిన భార్య తను ప్రేమించినవాడితో వెళ్లిపోవడాన్ని తట్టుకోలేకపోయిన ఓ సున్నిత మనస్కుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ముంబైలోని జరిగింది. పోలీసుల కథనం మేరకు ఆ వివరాలు ఇలా ఉన్నాయి.....

సెంట్రల్ ముంబైలోని అగ్రిపడా ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల డ్రైవర్ సునీల్ అగ్డీ తాను తీసిన వీడియో చూడాలని లేఖలో రాసి అనంతరం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య అనురాధ, ఆమె ప్రియుడు అబ్దుల్ వహబ్ అలియాస్ ఛోటూ కారణమని ఆ వీడియోలో పేర్కోన్నాడు.

ప్రియుడితో వెళ్ళిపోయిన తన భార్యను తనకు అప్పగించాలని అగ్రిపడా ఎస్సై అజిత్ కదంను కోరితే తనను ఎద్దేవా చేశాడు తప్ప చర్యలేమీ తీసుకోలేదని ఆరోపించాడు. దీంతో తనకు చావు తప్ప మరో మార్గం లేదని, తన చావుకు కారణం తన భార్య అనురాధ, ఆమె ప్రియుడు ఛోటూ అంటూ పేర్కొన్నాడు.

ఈ వీడియో చూసి అయినా న్యాయం చెప్పాలని కోరాడు. దీంతో, పోలీసులు.. ఆత్మహత్యకు పురిగొల్పడం, నేరానికి పాల్పడడం వంటి సెక్షన్ల కింద అనురాధ, ఆమె ప్రియుడిపై కేసులు నమోదు చేశారు. ఛోటూతో అనురాధ ఏడేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగిస్తోందని ఛోటూ భార్య హీరా తెలిపింది.

వెబ్దునియా పై చదవండి