మహిళా బిల్లును వ్యతిరేకించి తీరుతాం: యాదవ్ ద్వయం

సోమవారం, 5 ఏప్రియల్ 2010 (13:37 IST)
నేడు జరగనున్న అఖిలపక్ష సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లును తాము వ్యతిరేకిస్తామని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పి), రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)లు సోమవారం న్యూ ఢిల్లీలో ప్రకటించాయి.

మహిళా బిల్లు వచ్చే లోక్‌సభ సమావేశాల్లో ఎలాగైనా చట్టబద్దత కల్పించాలని యూపీఏ సర్కారు కసరత్తు మొదలెట్టింది. ఇందులో భాగంగా సోమవారం కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ అఖిలపక్ష నేతలతో సమావేశం నిర్విహించనున్నారు. ఈ సందర్భంగా ఎస్‌పి అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌లు సంయుక్తంగా కలిసి విలేకరులతో మాట్లాడారు.

తాము మహిళలకు వ్యతిరేకం కాదని, మహిళా రిజర్వేషన్ బిల్లులో ముస్లిం మహిళలు, వెనుకబడిన తరగతుల వారికి తగిన ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేస్తున్నామని, కాని యూపీఏ సర్కారు మొండిగా వ్యవహరిస్తోందని వారు పేర్కొన్నారు. ఇదిలావుండగా గత నెల రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన అంశంలో లోక్‌సభ, ఇతర శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లును సభ ఆమోదించిన విషయం విదితమే.

వెబ్దునియా పై చదవండి