మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని మౌనముద్ర!

FileFILE
మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై అన్ని ప్రాంతీయ పార్టీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో ఈ బిల్లుపై ప్రధాని మన్మోహన్ సింగ్ ఏమాత్రం నోరు మెదపడం లేదు. ఈ బిల్లు ఆమోదం పొందితే తాను సభలోనే విషం తాగుతానని జేడీయు చీఫ్ శరద్ యాదవ్ హెచ్చరించారు. అయినా.. ప్రధాని మాత్రం మౌనం వహిస్తున్నారు.

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ పార్లమెంటు ఉభయ సభలల్లో ప్రసంగిస్తూ, తమ ప్రభుత్వం మహిళలకు పార్లమెంటులో, శాసన సభల్లో 33 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ప్రకటిస్తారు. ఈ బిల్లును వచ్చే వంద రోజుల్లో ప్రవేశపెట్టి అమల్లోకి తెస్తామని రాష్ట్రపతి తన ప్రసంగంలో తెలిపారు.

ఈ బిల్లుపై జెడీ (యు), ఎస్.పీ, ఆర్‌జేడీ, యూడీఎఫ్‌తో సహా కొంతమంది ఇండిపెండెంట్లు తీవ్రంగా వ్యతిరేకించారు. జెడియు సభ్యుడు శరద్‌యాదవ్‌ ఒక అడుగు ముందకేసి ఈ బిల్లు ఆమోదం పొందితే తాను లోక్‌సభలోనే విషం తాగుతానని హెచ్చరించారు.

ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణసింగ్‌ బిల్లుపై మండిపడ్డారు. అయితే, ప్రధాన ప్రతిపక్షం బీజేపీ మాత్రం బిల్లుకు మద్దతు ప్రకటించింది. కానీ, ప్రధాని మన్మోహన్‌ మాత్రం తన ప్రసంగంలో మహిళా బిల్లు ప్రస్తావన చేయకపోవడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి