మాంద్యానికి అభివృద్ధి చెందిన దేశాలే కారణం

పెట్టుబడుల ప్రవాహాన్ని, ఎగుమతులను ప్రభావితం చేస్తున్న అంతర్జాతీయ ఆర్థిక మాంద్యానికి అభివృద్ధి చెందిన దేశాలే కారణమని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు, ఎగుమతులు మందగించడానికి ఆర్థిక మాంద్యం కారణమైన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మన్మోహన్ సింగ్ మంగళవారం మాట్లాడుతూ.. వ్యవస్థపరమైన వైఫల్యాన్ని అధిగమించేందుకు ప్రపంచ దేశాల మధ్య పరస్పర, మెరుగైన సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు భారత్ ఈ చర్యలు కోరుకుంటుందన్నారు.

మనం చూస్తున్న అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల వృద్ధిరేటును ప్రభావితం చేస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

అయితే ఇది మన తప్పు వలన జరిగింది కానప్పటికీ, మనం బాధితులయ్యామని రెండు రోజులపాటు ఇటలీలో జరిగే జి- 8 సమావేశానికి బయలుదేరి వెళుతున్న సందర్భంగా మన్మోహన్ సింగ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జి- 8 పారిశ్రామిక దేశాల సమావేశం జులై 9న ప్రారంభం కానుంది.

వెబ్దునియా పై చదవండి