మాధవన్ నాయర్‌పై వ్యక్తిగత కక్ష లేదు : కె.రాధాకృష్ణన్

మంగళవారం, 7 ఫిబ్రవరి 2012 (05:49 IST)
యాంట్రిక్స్-దేవాస్ ఒప్పందం విషయంలో ఇస్రో మాజీ చీఫ్ మాధవన్ నాయర్‌కు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని ప్రస్తుత ఇస్రో చీఫ్ కె.రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. తనను ఏమాత్రం విచారించకుండానే ఒప్పందంలో అనేక లొసుగులు చోటుచేసుకున్నట్లు అధికార నివేదికలో పేర్కొన్నారని, ఇది పిరికిపంద చర్యగా ఉందని నాయర్ ఆరోపణలు చేస్తున్నారు.

దీనిపై రాధాకృష్ణన్ మాట్లాడుతూ ఒప్పందంలోని లోపాలు, లొసుగులు, సిఫారసులను వివరిస్తూ ప్రత్యూష్ సిన్హా కమిటీ తమకు అందజేసిన లేఖ పూర్తి పాఠాన్ని నాయర్‌తో పాటు మరో ఏడుగురు అధికారులకు పంపామని చెప్పారు.

ఈ కమిటీ గత జూలైలో పంపిన లేఖకు నాయర్ వివరణ ఇచ్చారని వివరించారు. తర్వాత వ్యక్తిగతంగా తన వాదన వినిపించుకునేందుకు కూడా నాయర్‌కు కమిటీ చైర్మన్ అనుమతి ఇచ్చారన్నారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత కక్షలు లేవు. మేం ఎక్కడా పిరికివారిలా వ్యవహరించలేదని ఆయన స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి