రాజీవ్ గాంధీ హంతకులను తక్షణమే ఉరి తీయాలి!

శ్రీ పెరంబదూర్‌లో జరిగిన మాజీ ప్రధాని రాజీవ్ గాందీ హంతకులను తక్షణమే ఉరితీయాలని ఎల్టీటీఈ మానవబాంబు దాడిలో ఆయనతో పాటు మృతి చెందిన వారి కుటుంబీకులు డిమాండ్ చేశారు. రాజీవ్ హత్య కేసులో మరణ శిక్షను ఎదుర్కొంటున్న ముగ్గురు హంతకులను తక్షణమే ఉరి తీయాలని తాము డిమాండ్ చేస్తున్నామని నిరాహార దీక్ష చేసిన 15 మంది మృతుల కుటుంబ సభ్యులు తెలిపారు.

వీరికి మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నిరాహార దీక్షలో పాల్గొన్నారు. రాజీవ్ హత్య కేసులో మరణ శిక్ష పడిన ముగ్గురు హంతకులు మురుగన్, శంతన్, పెరారిసెల్వన్‌లను ఈ రోజు ఉరి తీయాల్సి ఉండింది. అయితే మద్రాసు హైకోర్టు వాళ్ల ఉరిని ఎనిమిది వారాల పాటు నిలిపివేసింది.

తమ మరణ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని కోరుతూ 11 ఏళ్ల క్రితం ఈ ముగ్గురు దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పిటిషన్లను రాష్టప్రతి ప్రతిభా పాటిల్ ఇటీవల తిరస్కరించిన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి