రుచిక ఆత్మహత్య కేసు: రాథోడ్‌కు సుప్రీం బెయిల్ మంజూరు

రుచిక గిర్హోత్రా ఆత్మహత్య కేసులో నేరారోపణలు ఎదుర్కుంటున్నుహర్యానా మాజీ డీజీపీ ఎస్‌పీసీ రాథోడ్‌కు సుప్రీంకోర్టు ఊరట కలిగించింది. ఈ కోసులో రాథోడ్‌కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే.. రాథోడ్ పాస్‌పోర్టును సీబీఐకు అప్పగించాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

జస్టిస్ పి సధాశివం, జస్టిస్ బీఎస్ చైహాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని వారు ఆదేశించారు.

హర్యానాకు చెందిన వర్ధమాన టెన్నిస్ క్రీడాకారిని రుచిక గిర్హోత్రా (13), హర్యానా లోని లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ గ్రౌండ్‌లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఎస్‌పీస్ రాథోడ్‌ అసోసియేషన్‌ అధ్యక్షునిగా ఉండేవాడు. ఆ సమయంలో రుచికపై కన్నేసిన రాథోడ్ 1990, ఆగస్టు 12న రుచికతో మాట్లాడాలని పిలిపించి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఈ విషయం బయటకు పొక్కితే తనను చంపుతానని బెదిరించాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన రుచిక విషయాన్ని తన తండ్రికి, సోదరునికి చెప్పింది. ఎక్కడ తన విషయం బయటకు పొక్కుతుందో అని భావించిన రాథోడ్‌ రుచికను పిలిపించి భయపెట్టడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.

వెబ్దునియా పై చదవండి