రెండువేల మందికి హిమలింగ దర్శన భాగ్యం

బుధవారం, 11 జులై 2007 (09:58 IST)
అమర్‌నాథ్‌ యాత్రలో భాగంగా తొమ్మిదో రోజున రెండు వేల మంది భక్తులకు హిమలింగ దర్శన భాగ్యం కలగనుంది. ఇందుకుగాను జమ్మూ శిబిరం నుంచి సుమారు రెండువేల మంది భక్తులు అమరనాథ్ యాత్రకు భయలుదేరారు. వీరిలో 1,337 మంది పురుషులు, 427 మంది మహిళలు, 82 మంది పిల్లలు కాగా, 133 మంది సాధువులు ఉన్నారు.

వీరు 67 వాహనాలలో బయలుదేరారు. వీరితో చేర్చి ఇప్పటివరకూ సుమారు 18 వేల మంది భక్తులు అధికారికంగా యాత్రకు వెళ్లినట్టు అధికారులు తెలిపారు. కాగా ఇదే సమయంలో రెండురోజుల పాటు వరుసగా కొండచరియలు విరిగిపడటం, వర్షాల కారణంగా యాత్రకు అంతరాయం కలిగినట్టు వారు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల రెండో తేది నుంచి అమరనాథ్‌ దర్శనంను ప్రారంభించిన సంగతి విధితమే.

వెబ్దునియా పై చదవండి