విభజన ఉద్యమాలకు ఐఎస్ఐ దన్ను: తెలంగాణాపై నీలినీడలు

దేశంలో విభజన ఉద్యమాలు మరిన్ని ఊపందుకునేటట్లు చేసి తద్వారా భారతదేశాన్ని అతలాకుతలం చేసే దిశగా పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టిందని భారతదేశ నిఘా వర్గాలు కేంద్రానికి నివేదించాయి.

ముఖ్యంగా పంజాబ్‌లో ఖలిస్థాన్ ఉద్యమం రగిలించి మతకల్లోలు సృష్టించడం ద్వారా దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలన్న పక్కా ప్లాన్‌ను ఐఎస్ఐ సిద్ధం చేసుకున్నట్లు నిఘా వర్గాలకు ఖచ్చితమైన సమాచారం అందినట్లు విశ్వసనీయ సమాచారం.

ఈ పిడుగులాంటి వార్తతో కేంద్రం పంజాబ్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది. ఇదిలావుండగా ఈ వార్త తెలంగాణా ఉద్యమకారులకు ఆందోళన కలిగిస్తుంది. నిఘావర్గాల హెచ్చరికల నేపధ్యంలో తెలంగాణా వాదాన్ని కేంద్రం పరిశీలించదేమోనన్న బెంగ తెలంగాణా వాదులకు పట్టుకుంది.

వెబ్దునియా పై చదవండి