కంటి సమస్యలతో బాధపడుతున్న పాయల్ రాజ్‌పుత్ (Video)

ఠాగూర్

సోమవారం, 19 మే 2025 (10:38 IST)
సినీ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కంటి సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి వస్తువు రెండుగా కనిపిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యం సరిగా లేకపోయినా, ఇచ్చిన మాట ప్రకారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నట్టు తెలిపారు. కంటి సమస్యను ఎలా ఎదుర్కోవాలో తెలియక కళ్లద్దాలతో కవర్ చేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో పాయల ఏ సమస్యతో బాధపడుతున్నారో తెలియక ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. 
 
"ఆర్ఎక్స్ 100" చిత్రం విజయంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్‌పుత్‌కు  ఆతర్వాత ఆశించిన విజయాలు దక్కలేదు. అయినప్పటికీ హిట్స్, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆలరిస్తున్నారు. 
 
ఇటీవల మంగళవారం అనే సినిమాతో ఆమె మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. పాయల్‌ తెలుగులో మొత్తం 12 సినిమాల్లో నటించగా, వాటిలో రెండు మాత్రమే విజయం సాధించాయి. తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించినా ఆమెకు అంతగా కలిసిరాలేదని చెప్పొచ్చు. 





 

Payal Rajput ????#PayalRajput pic.twitter.com/FTkEqcQt3X

— WV - Media (@wvmediaa) May 18, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు