తమిళనాడులో ఎన్నికల వేడి బాగా హీటెక్కింది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే-డీఎంకేల మధ్య రసవత్తర పోరు జరుగనుంది. విజయకాంత్.. కూటములు సైతం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అయితే ఈసారి అధికారం ఎవరు దక్కించుకుంటారో తెలియదు కానీ.. తమిళనాట రాజకీయ చక్రం తిప్పుతున్న విప్లవనాయిక జయలలితకు అరుదైన ఘనత ఉంది.