తమిళనాడులోని తిపత్తూరు జిల్లాలోని నాట్రాంపల్లి సమీపంలోని పుదుపేట పక్రిమఠం గ్రామానికి చెందిన 25 ఏళ్ల విఘ్నేష్ 2018లో ఏడేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనితో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. గురువారం నాడు ఈ కేసుపై తీర్పును వెలువరిస్తూ నిందితుడు విఘ్నేష్‌కి పదేళ్ల జైలు శిక్ష విధించింది.