ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 10 మంది మావోయిస్టులు మృతి

ఠాగూర్

మంగళవారం, 21 జనవరి 2025 (10:01 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్‌ - ఒడిశా రాష్ట్రాల సరిహద్దులోని గరియాబంద్‌ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో సుమారుగా 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకోగా.. భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. 
 
మంగళవారం పది మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. చనిపోయిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఓ జవాన్‌ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన జవాన్‌ను హెలికాఫ్టరులో రాయపుర్‌ తరలించారు. కాగా, గత కొంతకాలంగా మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు