ఆ కూలీ కడుపులో ఏమున్నాయంటే..? చూసిన వైద్యులు షాక్..

మంగళవారం, 6 ఆగస్టు 2019 (13:23 IST)
కూలీకి ఆపరేషన్ చేసిన వైద్యులు అతని కడుపులో వున్న వస్తువులు చూసి షాకయ్యారు. ఇంతకీ అతని కడుపులో ఏమున్నాయంటే.. 111 ఇనుప మేకులున్నాయి. వివరాల్లోకి వెళితే.. తిరుచ్చూరుకు చెందిన 49 ఏళ్ల ఓ కూలీకి తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ అతనిని పరిశోధించిన వైద్యులు శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ చేసిన వైద్యులు షాకయ్యారు. 
 
ఆ సమయంలో 111 మేకులు వుండటం చూశారు. వాటిని అతని కడుపు నుంచి తొలగించడం జరిగింది. మానసిక రోగి అయిన ఆ కూలీ.. గత పది సంవత్సరాల పాటు రోడ్డుపై గల మేకులను తింటూ వచ్చాడని వైద్యులు చెప్పారు. సాధారణ కడుపునొప్పి అంటూ తేలిగ్గా తీసుకున్న వైద్యులు.. చివరికి స్కాన్ తీయడంతో షాకయ్యారు. ఆపై శస్త్రచికిత్స నిర్వహించి.. కూలీ కడుపులోని మేకులను తొలగించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు