ఈ సంఘటనపై సౌత్‌వెస్ట్ డీసీపీ సురేందర్ కుమార్ మాట్లాడుతూ మద్యం సేవించిన కొందరు యువకులు ఒక బాలుడిని వెంటబడి వేధించినట్టు తెలిపారు. అయితే బాధితుడిపై ఎటువంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని వైద్య పరీక్షల్లో తేలినట్టు తెలిపారు. అకారణంగా కొట్టినందుకు నిందితులపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేసినట్టు చెప్పారు.
కానీ, ఆ పోకిరీలు తీసి పోస్ట్ చేసిన వీడియోలో మాత్రం బాలుడి చేతులు కాళ్ళు కట్టేసి కొట్టి చిత్రహింసలకు గురిచేసినట్టుగా ఉంది. ఆ తర్వాత ఆ బాలుడి నోటిలోకి బీరు బాటిల్స్‌ను బలవంతంగా నెట్టేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. మరోవైపు బాలుడిపై లైంగిక దాడి జరిగిందని అతడి బంధువులు ఆరోపించారని, ఈ అవమానం తట్టుకోలేక అతడు ఆత్మహత్యకు ప్రయత్నించాడని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చుతున్నారు.