రాజస్థాన్ రాష్ట్రంలోని చురూ జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. మేకలు కాస్తున్న ఓ బాలికపై కామాంధులు కన్నేశారు. జీపులో తీసుకువెళ్లి, దాదాపు నెలరోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పాడ్డారు. ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది.
జిల్లాలోని మరో చోటుకు తీసుకువెళ్లి 20 నుంచి 25 రోజులుగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి, ఇంటికి చేరుకుంది. తర్వాత మహిళా పోలీస్ స్టేషన్లో బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.
మత్తుపదార్థాన్ని కలిపి.. బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టేముందు.. తేనీటిలో మత్తుపదార్థాన్ని నిందితులు కలిపి తాగించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ముగ్గురు నిందితులపై ఐపీసీ, పోక్సో చట్టం కింద.. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలిస్తున్నారు.