పశ్చిమ చంపారన్ జిల్లాలో మంగళవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగింది. ఈ క్రమంలో టీకా తీసుకున్న వారిలో ఇద్దరు ఏఎన్ఎంలు అస్వస్థతకు గురికావడంతో వారిలో ఒకరిని బెతియా ఆసుపత్రికి, మరొకరిని రాంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ప్రస్తుతం వారిద్దరికీ చికిత్స కొనసాగుతోందని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చురుగ్గా కొనసాగుతోంది. టీకా తీసుకున్న వారిలో అక్కడక్కడ స్పల్ప దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. అయితే, అవి సహజమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.