వికటిస్తున్న కరోనా టీకాలు.. ఇద్దరికి అస్వస్థత.. ఒకరి మృతి

మంగళవారం, 19 జనవరి 2021 (12:26 IST)
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్టే వేసేందుకు ఫార్మా కంపెనీలు తయారు చేసిన టీకాలు ఇపుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ వ్యాక్సిన్ల పంపిణీ ఇపుడు జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఈ వ్యాక్సిన్ వేసుకున్న ఇద్దరు ఏఎన్ఎంలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
పశ్చిమ చంపారన్ జిల్లాలో మంగళవారం వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగింది. ఈ క్రమంలో టీకా తీసుకున్న వారిలో ఇద్దరు ఏఎన్ఎంలు అస్వస్థతకు గురికావడంతో వారిలో ఒకరిని బెతియా ఆసుపత్రికి, మరొకరిని రాంనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. 
 
ప్రస్తుతం వారిద్దరికీ చికిత్స కొనసాగుతోందని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చురుగ్గా కొనసాగుతోంది. టీకా తీసుకున్న వారిలో అక్కడక్కడ స్పల్ప దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయి. అయితే, అవి సహజమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు