ఓ కామాంధుడి బ్లాక్‌మెయిల్‌కు భయపడి ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మైసూరులో చోటుచేసుకుంది. తల్లి నగ్నఫోటోలు తన వద్ద ఉన్నాయని.. తాను చెప్పినట్లు వినాలని.. లేకుంటే సోషల్ మీడియాలో ఆ ఫోటోలను పోస్ట్ చేస్తానని నిత్యం వేధిస్తూ వెంటాడిన ఆ కామాంధుడి చర్యలకు తాళలేక 21 ఏళ్ల యువతి బలవన్మరణానికి పాల్పడింది.
వివరాల్లోకి వెళితే... మైసూరు సమీపంలోని బన్నూరుకు చెందిన నిందితుడు రవి పరారీలో ఉన్నాడు. తండ్రి లేకపోవడంతో.. తల్లి సంరక్షణలో ఉంటూ కాలేజీ చదువుకుంటున్న ఆ యువతి.. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంది. అంతలో ప్రేమ పేరుతో రవి వేధించాడు. అమ్మకు సంబంధించిన ఫోటోలున్నాయని లక్ష రూపాయలు ఇవ్వాలని.. చెప్పినట్లు వినాలని బెదిరించాడు.