పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో దేశంలో నకిలీ విశ్వవిద్యాలయాలకు సంబంధించి లోక్ సభలో పలువురు ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నలు వేశారు. ఈ ప్రశ్నలకు సమాధానంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 8 ఫేక్ యూనివర్సిటీలను యూజీసీ గుర్తించినట్లు వెల్లడించారు.
ఇక ఢిల్లీలో 7, ఒడిశాలో 2, పశ్చిమ బెంగాల్‌లో 2, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో ఒక్కో నకిలీ యూనివర్సిటీలను గుర్తించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, సాధారణ ప్రజలు, మీడియా ఫిర్యాదుల ద్వారా ఫేక్ యూనివర్సిటీలను గుర్తించినట్లు లోక్‌సభలో కేంద్రం తెలిపింది.