ఢిల్లీ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. సిరప్ తాగిన పాపానికి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముగ్గురు వైద్యుల సేవలను రద్దు చేసి, ఈ విషయంపై విచారణకు ఆదేశించింది. కానీ ఈ ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ రాజీనామా చేయాలని, ముగ్గురు పిల్లల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని బీజేపీ, కాంగ్రెస్ డిమాండ్ చేశాయి.
డెక్స్ట్రోమెథోర్ఫాన్ అనేది దగ్గును అణిచివేసే మందులలో ఒకటి. ఈ మందును సేవించిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన ముగ్గురు పిల్లల కుటుంబాలకు రూ. 1 కోటి పరిహారం, మరో 13 మంది పిల్లలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.