కేరళకు పాకిన మతమార్పిడులు : హిందూ మతంలోని 30 మంది క్రైస్తవులు!

సోమవారం, 22 డిశెంబరు 2014 (14:59 IST)
మతమార్పిడులు ఉత్తర భారతదేశం నుంచి కేరళ రాష్ట్రానికి పాకాయి. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ మతమార్పిడులు జరిగాయి. కేరళ రాష్ట్రంలోని అళప్పుళకు చెందిన 8 క్రైస్తవ కుటుంబాల్లోని 30 మంది హిందూ మతం స్వీకరించారు. కనిచానలూరులోని ఓ దేవాలయంలో ఆదివారం ఈ మత మార్పిడులు జరిగాయి. 
 
ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించగా, కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చట్టాలకు వ్యతిరేకంగా మత మార్పిడులు జరిగాయా? అనే కోణంలో దర్యాప్తునకు ఆదేశించినట్టు హోం మంత్రి సి.రమేష్ తెలిపారు. కాగా, మరో 150 కుటుంబాలు తిరిగి హిందూ మతంలోకి రావాలని కోరుకుంటున్నాయని స్థానిక వీహెచ్‌పీ నేత ప్రతాప్ పడిక్కల్ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి