ఉత్తరకాశీలో కొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి. పలు ప్రాంతాల్లోని ఇళ్లు కంపించడం జనం ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. వారం రోజుల వ్యవధిలో ఉత్తరకాశీలో భూకంపం రావడం ఇది మూడోసారి.
తాజాగా ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.
ప్రకంపనలు స్వల్పంగా ఉండటంతో.. ప్రజలకు ప్రకంపనల ప్రభావం తెలియలేదు. ఉత్తరకాశీకి 39 కిలోమీటర్ల దూరంలో శనివారం ఉదయం 5.30 గంటలకు భూకంపం సంభవించింది. కాగా.. ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరిగిన దాఖలాలు లేవు.