శివకాశిలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి.. గుర్తించలేని స్థితిలో..?

గురువారం, 25 ఫిబ్రవరి 2021 (22:01 IST)
శివకాశిలో ప్రాంతంలో నేడు కూడా భారీ పేలుడు ఘటన జరిగింది. విరుదునగర్ జిల్లా కాళయ్యర్ కురిచ్చిలోని ఓ బాణసంచా పరిశ్రమలో ఫ్యాన్సీ రకం టపాకాయలు తయారుచేస్తుండగా విస్ఫోటనం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. 
 
క్షతగాత్రులను శివకాశి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు ధాటికి 10 గదులు నేలమట్టం అయ్యాయి. మృతదేహాలు బాగా కాలిపోవడంతో గుర్తించడం కష్టమైందని అధికారులు తెలిపారు. శివకాశి ప్రాంతంలో గత రెండు వారాల వ్యవధిలో ఇది మూడో పేలుడు ఘటన కావడం గమనార్హం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు