ప్రధానమంత్రిగా నెహ్రూ వివిధ కార్యక్రమాలలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ ప్రతి రోజూ కొంతసమయాన్ని పిల్లలతో సరదాగా గడిపేవారు. పిల్లలపై ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనురాగాలకు గుర్తుగా నవంబర్ 14ను బాలల దినోత్సవంగా గుర్తించారు.
దేశవ్యాప్తంగా పాఠశా లల్లో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రకాల ఆట పాటలు, వ్యాసరచన, ఉపన్యాసం, క్విజ్ పోటీలు పెట్టి బహుమతులు ప్రదానం చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పిల్లలు ఆనందోత్సవాలతో పాల్గొంటారు. పాఠశాలల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.
భారత స్వాతంత్రోద్యమ పోరాటంలో పాల్గొని, దేశ తొలి ప్రధాన మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన జవహర్ లల్ నెహ్రూ నవంబర్ 14, 1889న అలహాబాదులో జన్మించారు. పండిత్‌జీగా, చాచా నెహ్రూగా ప్రసిద్ధి చెందిన ఈయన గాంధీ- నెహ్రూ కుటుంబంలో ప్రముఖులు. దేశ ప్రధానిగా 17 సంవత్సరాలు పనిచేశారు.