వాషింగ్టన్ డి.సిలో భారత రాయబారి కార్యాలయం నుంచి దీపావళి వేడుకలకు నాట్స్‌కు ప్రత్యేక ఆహ్వానం

శనివారం, 2 నవంబరు 2019 (22:21 IST)
వాషింగ్టన్ డీసీ: వాషింగ్టన్ డీసీలో భారత రాయబార కార్యాలయం దీపావళి వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా భారతీయులకోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థలను రాయబార కార్యాలయం ఆహ్వానించింది. తెలుగువారి మేలు కోసం అనేక సేవాకార్యక్రమాలను చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్‌ను దీపావళి వేడుకల్లో పాలుపంచుకోవాలనికోరుతూ భారత రాయబార కార్యాలయం నుంచి ఆహ్వానం అందింది. 
 
దీంతో నాట్స్ కూడా వాషింగ్టన్ డీసీ దీపావళివేడుకల్లో భాగస్వామి అయింది. ఈ సందర్భంగా భారత రాయబారి హర్షవర్థన్ ష్రింగ్లా ప్రవాస భారతీయ ప్రతినిధులకువిందు ఇచ్చారు. ఇందులో నాట్స్ ప్రతినిధిగా నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ప్రశాంత్ పిన్నమనేని హాజరయ్యారు. నాట్స్ పడుతున్న అనేక సేవా కార్యక్రమాలను తెలుసుకున్న భారత రాయబారకార్యాలయం నాట్స్‌కు ఆహ్వానాన్ని పంపడంపై నాట్స్ జాతీయ నాయకత్వం హర్షం వ్యక్తం చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు