కామాంధుడి చెరనుంచి తప్పించుకునేందుకు శవంలా నటించిన ఎనిమిదేళ్ళ బాలిక!

బుధవారం, 1 జూన్ 2016 (11:30 IST)
అత్యాచారాలకు నిలయమైన ఢిల్లీలో మరో దారుణం జరిగింది. ఢిల్లీలోని కిరారి ప్రాంతంలో ఎనిమిదేళ్ల బాలికపై కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ బాలిక ఆ కామాంధుడి చెర నుంచి తప్పించుకోవడానికి చాలా చక్యంగా చనిపోయినట్లు నటించి తనను తాను రక్షించుకుంది. 
 
ఈ కేసు పూర్తి వివరాలను పరిశీలిస్తే... అర్థరాత్రి 2 గంటల సమయంలో ఆరు బయట పడుకున్న చిన్నారిని కామాంధుడు ఎత్తుకుపోయాడు. బాలికకు మెలకువ వచ్చి కళ్లు తెరిచి చూసేసరికి ఇంట్లో కాకుండా వేరే ప్రాంతంలో ఉండటం చూసి నివ్వెరపోయింది. తనను రక్షించడానికి గట్టిగా అరించేందుకు ప్రయత్నాలు చేసింది. కానీ కామాంధుడు బాలిక నోరును బలవంతంగా మూసేశాడు. దీంతో ఆ దుర్మార్గుడి బారినుండి తప్పించుకోవడానికి ఒక పథకం ఆలోచించింది. 
 
పథకం ప్రకారం ఆమె కదలకుండా ఉండిపోయి, చనిపోయినట్లు నటించింది. దీంతో కామాంధుడు భయపడి బాలికను గిల్లి చూశాడు, అయినా కూడా బాలిక ఒంట్లో ఏమాత్రం చలనం కనిపించలేదు. బాలిక చనిపోయింది అనుకుని నిందితుడు బాలిక నుంచి దూరంగా వెళ్లగానే లేచి ఇంటి వైపు పరుగు తీసింది. నిందితుడు బాలికను పట్టుకునే ప్రయత్నంలో రాయి తగిలి కింద పడిపోయాడు. ఇంటికి చేరుకున్న బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వెబ్దునియా పై చదవండి