తాళిబొట్టు ధరించిన మహిళలను కుక్కలతో పోల్చిన మహిళా ప్రొఫెసర్

మంగళవారం, 10 నవంబరు 2020 (21:39 IST)
హిందూ సాంప్రదాయం ప్రకారం మహిళలు మంగళసూత్రాన్ని పవిత్రంగా భావిస్తారు. స్త్రీలకు వివాహిత హోదాను అందించేది మంగళసూత్రమే. అటువంటి పవిత్రమైన మంగళసూత్రాన్ని ధరిస్తున్న మహిళలపై ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
 
వివరాలు ఇలా వున్నాయి. గోవా లోని వీఎం సాల్గావ్‌కర్ న్యాయ విద్య కళాశాలలో శిల్పాసింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. అయితే ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలోని పేజీలో మహిళలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మెడలో మంగళసూత్రం ధరించిన మహిళలను గొలుసుతో కట్టేసిన కుక్కలతో పోల్చారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్రీయ హిందూ యువ వాహిని గోవా విభాగానికి చెందిన రాజీవ్ ఝూ ఆందోళన చేసారు.
 
మతపరమైన భావాలను ప్రొఫెసర్ శిల్పాసింగ్ కావాలనే అవమానించారని ఆరోపించారు. ఆమెపై పనీజీ టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు సెక్షన్ 295(ఏ) కింద కేసు నమోదు చేశారు. కాగా ఆమెను ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని కాలేజి యాజమాన్యాన్ని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు