ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడికి కొత్త చిక్కు వచ్చి పడింది. లాలూ ప్రసాద్ కుమారుడు తేజ్ ప్రతాప్ సింగ్ సతీమణి ఐశ్వర్యా రాయ్ సంచలన ఆరోపణలు చేశారు. అత్త రబ్రీ దేవి, ఆడపడుచు మీసాభారతి మీద ఆమె ఆరోపణలు చేశారు. తనకు మూడు నెలలుగా తిండి పెట్టడం లేదని, వంటింట్లోకి కూడా రానీయడం లేదన్నారు.
తనను తీవ్రంగా వేధిస్తున్నారంటూ ఆమె మహిళా హెల్ప్ లైన్‌కు ఫోన్ చేయడంతో పోలీసులు రంగంలోకిదిగారు. తండ్రి చంద్రికా రాయ్‌తో కలిసి లాలూ అవుట్ హౌస్ లో ధర్నాకు దిగింది. అత్త రబ్రీదేవి, ఆడపడుచు మీసా భారతికి తానంటే మొదటి నుంచీ ఇష్టం లేదని, ఇంత పెద్ద ఇంట్లో మూడు నెలలుగా తనకు తిండి పెట్టట్లేదని చెప్పారు.