కేంద్రం ప్రకటించిన ఈ స్కీమ్ పట్ల యువత నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. తాజాగా బీహార్ యువత ఈ స్కీమ్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శనలకు దిగారు. రోడ్లు, రైలు పట్టాల పైకి చేరి నిరసన తెలియజేశారు.
పలుచోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి. శరన్ జిల్లాలోని ఛప్రా వద్ద నిరసనకారులు ఓ ప్యాసింజర్ రైలుకు నిప్పంటించారు. ఆరా రైల్వే స్టేషన్ వద్ద నిరసనకారులు రాళ్లు రువ్వారు. బక్సర్ జిల్లాలో దాదాపు 100 మంది యువత రైల్వే స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లి రైలు పట్టాలపై బైఠాయించారు. జన శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌ను 30 నిమిషాల పాటు అక్కడినుంచి కదలనివ్వలేదు.