ఢిల్లీ వాసులకు చేదువార్త-రోజు రోజుకీ పెరుగుతున్న కాలుష్యం

బుధవారం, 30 ఆగస్టు 2023 (13:22 IST)
దేశ రాజధాని ఢిల్లీలో రోజు రోజుకీ కాలుష్యం పెరిగిపోతుంది. రానున్న కాలంలో ఢిల్లీ వాసులపై కాలుష్య ప్రభావం తీవ్రంగా వుంటుందని చికాగో యూనివర్శిటీలోని ఎనర్జీ పాలసీ ఇన్‌స్టిట్యూట్ విడుదల చేసిన ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ వెల్లడించింది. 
 
భారత దేశ రాజధాని ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఉందని, కాలుష్య స్థాయి ఇలాగే కొనసాగితే ఢిల్లీ ప్రజలు తమ 11.9 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోయే అవకాశం వుందని తేలింది. 
 
భారతదేశంలోని 1.3 బిలియన్ల ప్రజలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) నిర్దేశించిన కాలుష్య పరిమితిని దాటిన ప్రాంతాల్లోని నివసిస్తున్నారని చికాగో వర్శిటీ తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు