10 లక్షల మందికి పైగా ప్రజలకు కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఖర్చును భరిస్తోన్న అమెజాన్‌ ఇండియా

మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (17:21 IST)
భారతదేశంలో 45 సంవత్సరాలు దాటిన వ్యక్తులకు కోవిడ్‌-19 వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నవి. అమెజాన్‌ ఇండియా తమ ఉద్యోగులు, అసోసియేట్లు, విక్రేతలతో పాటుగా భాగస్వాములను వీలైనంత త్వరగా తగిన సమయంలో వ్యాక్సిన్‌లు వేయించుకుని తమతో పాటుగా తమ కుటుంబ సభ్యులు, వారి కమ్యూనిటీలను కాపాడుకోవాల్సిందిగా ప్రోత్సహిస్తుంది. 
 
అమెజాన్‌ ఇండియా ఇప్పుడు కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ ఖర్చును కేవలం తమ భారతీయ ఉద్యోగులు మరియు అసొసియేట్లకు మాత్రమే కాదు, అమెజాన్‌ ఫ్లెక్స్‌ డ్రైవర్లు, ఐ హ్యావ్‌ స్పేస్‌ (ఐహెచ్‌ఎస్‌) స్టోర్‌ భాగస్వాములు, ట్రకింగ్‌ భాగస్వాములు మరియు వారి అర్హత కలిగిన డిపెండండ్లు సహా డెలివరీ సర్వీస్‌ పార్టనర్‌ అసోసియేట్స్‌ నెట్‌వర్క్‌ భాగస్వాములకు సహా ఖర్చును అమెజాన్‌ ఇండియా భరించనుంది. అంతేకాదు, గత సంవత్సర కాలంగా చురుగ్గా అమెజాన్‌ డాట్‌ ఇన్‌పై లిస్టింగ్‌ చేయబడ్డ విక్రేతలకు సైతం ఈ ప్రయోజాలను అమెజాన్‌ ఇండియా వెల్లడించింది.
 
ఈ కంపెనీ ఇప్పుడు సమగ్రమైన మద్దతు యంత్రాంగాన్ని తమ ఉద్యోగులు మరియు అమెజాన్‌తో కలిసి పనిచేస్తోన్న అసోసియేట్లకు మరియు స్టాఫింగ్‌ ఏజెన్సీల ద్వారా విధులలో తీసుకోబడ్డ వారికి అందిస్తుంది. కోవిడ్‌ 19 చికిత్స కోసం అయ్యే ఖర్చును అమెజాన్‌ ఇండియా అందించడంతో పాటుగా హాస్పిటల్‌ సెర్చ్‌, నిర్ధేశిత కోవిడ్ 19 పరీక్షల కవరేజీ సైతం అందిస్తుంది. పరిస్థితులను అధిగమించేందుకు తగిన పరిష్కారాలను అందించే రీతిలో కార్యక్రమాలను సైతం తీసుకుంది.
 
ఈ అభివృద్ధి గురించి అమిత్‌ అగర్వాల్‌, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అండ్‌ కంట్రీ మేనేజర్‌, అమెజాన్‌ ఇండియా మాట్లాడుతూ, ‘‘గత సంవత్సర కాలంగా, మా బృందాలు, విక్రేతలు, భాగస్వాములు సంక్షోభ పరిస్థితులను సైతం ధైర్యంగా ఎదుర్కొంటున్న తీరు అభినందనీయం. దేశవ్యాప్తంగా కోవిడ్‌ 19 విసిరిన సవాల్‌ను వారు అంతే ధైర్యంగా స్వీకరించారు. ఎన్నో ఆవిష్కరణలు, మరీ ముఖ్యంగా భారతదేశవ్యాప్తంగా ప్రజలకు సేవలనందించాలనే బలీయమైన కోరికను మేము చూశాం. మా బృందాల ఆరోగ్యం మరియు భద్రతతో పాటుగా మా భాగస్వాముల భద్రత మాకు అత్యంత ప్రాధాన్యతాంశం అయింది. 
 
అర్హత కలిగిన వ్యక్తులను వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సిందిగా మేము ప్రోత్సహిస్తున్నాం మరియు మా ఉద్యోగులు, అసోసియేట్లు, నిర్వహణ భాగస్వాముల నెట్‌వర్క్‌, విక్రేతలు కోసం వ్యాక్సినేషన్‌ ఖర్చును మేము అందిస్తున్నాం. అంతేకాదు, అర్హత కలిగిన డిపెండెండ్లకు సైతం భద్రతకు భరోసా అందిస్తూ వ్యాక్సినేషన్‌ ఖర్చును అందిస్తున్నాం’’ అని అన్నారు.
 
ఈ నూతన ప్రయోజనాలు 2.5 బిలియన్‌ డాలర్ల ప్రత్యేక బోనస్‌లపై అమెజాన్‌ పెట్టుబడులు మరియు గత సంవత్సర కాలంగా అంతర్జాతీయంగా బృందాలకు ప్రోత్సాహాకాలలో భాగంగా ఉంటాయి. మొత్తంమ్మీద కంపెనీ కొవిడ్‌ 19 సంబంధిత చర్యల కోసం 11.5 బిలియన్‌ డాలర్లును కంపెనీగా పెట్టుబడిగా పెట్టింది. ఈ పెట్టుబడులుతో పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) ను కంపెనీ అందించడంతో పాటుగా ఉద్యోగులతో పాటుగా భాగస్వాముల కోసం విస్తృత శ్రేణి భద్రతా చర్యలను ఇతర ఆర్థిక మద్దతు కార్యక్రమాలతో పాటుగా అంతర్జాతీయ నెట్‌వర్క్‌ వ్యాప్తంగా అందిస్తుంది.
 
2020లో, అమెజాన్‌ పలు కార్యక్రమాలను ఎస్‌ఎంబీలకు మద్దతునందించేందుకు భారతదేశంలో పలు కార్యక్రమాలను తీసుకువచ్చింది. కోవిడ్‌ 19 మహమ్మారి తీసుకువచ్చిన సవాళ్లను అధిగమించేందుకు ఆర్థిక సవాళ్లను తీసుకురావడంతో పాటుగా ఫీజుల రద్దు, విధాన నిర్ణయాలలో సడలింపులు వంటివి సైతం ఉన్నాయి. భీమా ప్రదాతలతో మేము కలిసి పనిచేయడంతో పాటుగా అర్హత కలిగిన విక్రేతలందరికీ కోవిడ్‌ 19 ఆరోగ్య భీమా కవరేజీ సైతం అమెజాన్‌ డాట్‌ ఇన్‌పై అందించింది. ఈ కంపెనీ ఆన్‌ డిమాండ్‌ డిస్‌బర్శ్‌మెంట్స్‌ను సైతం ప్రతి రోజూ తమ డిస్బర్శ్‌మెంట్స్‌ను విక్రేతలు పొందేందుకు సహాయపడింది.
 
అమెజాన్‌ రిలీఫ్‌ ఫండ్‌ (ఏఆర్‌ఎఫ్‌)ను భారతదేశంలో ఏప్రిల్‌ 2020వ తేదీన 25 మిలియన్‌ డాలర్ల రిలీఫ్‌ ఫండ్‌తో ఏర్పాటుచేశారు.  భాగస్వాములతో పాటుగా అర్హత కలిగిన వ్యక్తులకు మద్దతును ఇది కొనసాగిస్తుంది. ఏఆర్‌ఎఫ్‌ను అర్హత కలిగిన వ్యక్తులు వినియోగించుకోవచ్చు. క్వారంటైన్‌ లేదా కోవిడ్‌ 19 నిర్ధారించబడిన వ్యక్తులు దీనిని వినియోగించుకోవచ్చు. ఈ కంపెనీ అమెజాన్‌ రిలీఫ్‌ ఫండ్‌ను అర్హత కలిగిన డెలివరీ అసొసియేట్లు అందరికీ అందుబాటులోకి అందిస్తుంది. డెలివరీ సర్వీస్‌ పార్టనర్‌ ప్రోగ్రామ్‌, అమెజాన్‌ ఫ్లెక్స్‌ ప్రోగ్రామ్‌లో భాగమైన వారితో పాటుగా ట్రకింగ్‌ భాగస్వాములకు రవాణా మద్దతును ఆర్థిక అవరోధాల వేళ అందిస్తుంది.
 
అమెజాన్‌ ఇండియా ఇప్పుడు పార్టనర్‌ సపోర్ట్‌ ఫండ్‌ను చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలకు కంపెనీ యొక్క లాజిస్టిక్స్‌ నెట్‌వర్క్‌లో భాగంగా అందిస్తుంది. ఏప్రిల్‌ 2020లో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ కారణంగా వీరు ఆర్థికంగా తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఇది వారి డెలివరీ సర్వీస్‌ భాగస్వాములు మరియు ఎంపిక చేసిన రవాణా భాగస్వాములకు, వారి వేలాది అసొసియేట్లకు ఆర్థిక అవరోధాల వేళ మద్దతునందించడంతో పాటుగా ఈ వ్యాపారవేత్తల స్థిరమైనఖర్చులు, లిక్విడిటీ ఆందోళనలను సైతం కవర్‌ చేయడంలో సహాయపడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు