తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పఠనమిట్ట జిల్లా పంథాల ప్రాంతంలో ఓ యువతి బంధువుల ఇంట్లో ఉంటోంది. కరోనా లక్షణాలుండటంతో క్వారంటైన్‌లో ఉన్న ఆమెకు పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. ఆమెతోపాటు మరొకరిని కరోనా సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లేందుకు 108 అంబులెన్స్ డ్రైవర్ నౌఫాల్ (25) వచ్చాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు అరన్ములా పోలీసులు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఘటనపై ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డ్రైవర్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని '108 సర్వీస్' కార్యాచరణ భాగస్వామి జీవీకే సంస్థకు సూచించారు. నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.